: భారత్ కు డ్రోన్ల ఎగుమతికి డీఎస్పీ-5 లైసెన్సులు జారీ చేసిన అమెరికా


అత్యాధునిక ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాతో భారత్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. మొత్తం 22 డ్రోన్ల కొనుగోలుకు సబంధించి ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో, భారత్ కు ప్రిడేటర్ డ్రోన్లను ఎగుమతి చేసేందుకు అవసరమైన డీఎస్పీ-5 తరగతికి చెందిన లైసెన్సులను అమెరికా విదేశాంగ శాఖ నిన్న జారీ చేసింది. దీంతో, అంతర్జాతీయ ఆయుధాల సరఫరా నియంత్రణకు లోబడి మన దేశానికి శాశ్వత ప్రాతిపదికన సైనిక హార్డ్ వేర్ ఎగుమతి అవుతుంది. మరోవైపు, ఈ డ్రోన్లు భారత్ కు వస్తుండటంతో పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ లు కలవరపాటుకు గురవుతున్నాయి.

  • Loading...

More Telugu News