: తిరుమల శ్రీవారికి మస్కట్ భక్తుని విలువైన కానుక


తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి మస్కట్ కు చెందిన భక్తుడొకరు విలువైన కానుకను అందజేశారు. సుమారు రూ. 2.5 కోట్ల విలువ చేసే వజ్రాలు పొదిగిన భుజకీర్తులను స్వామివారికి అందించారు. వీటిని స్వీకరించిన అధికారులు, 16వ తేదీన జరిగే ఆణివార ఆస్థానం సందర్భంగా స్వామివారికి అలంకరిస్తామని తెలిపారు. వీటిని తొలిసారి మూల విరాట్ కు మాత్రమే అలంకరించాలని సదరు భక్తుడు కోరినట్టు అధికారులు తెలిపారు. ఈ నూతన భుజకీర్తులను అలంకరించిన తరువాత, భక్తుల నుంచి వచ్చే స్పందనను బట్టి, వాటిని కొనసాగించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News