: రామమందిర నిర్మాణంలో ఇటుకల సేకరణకు నా అనుమతి అవసరం లేదు: యోగి ఆదిత్యనాథ్
భారత్ లో అత్యధిక పర్యాటకులు సందర్శించే స్థలం ఆగ్రా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మాత్రం, భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదని స్పష్టం చేశారు. తాజ్ మహల్ ఆధారంగా దేశానికి గుర్తింపునిచ్చే ప్రయత్నం సరైంది కాదని అన్నారు. రామ మందిర నిర్మాణం విషయంలో ప్రజలకు తనపై ఉన్న నమ్మకాన్ని చూస్తుంటే గర్వంగా ఉందని ఆయన చెప్పారు.
రామమందిర నిర్మాణం కోసం రాళ్లు సమకూర్చేందుకు తన అనుమతి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే రామమందరం నిర్మాణంపై నెలకొన్న వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టు సూచనకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. ఈ అంశంలో ఇరువర్గాల మధ్య చర్చలు జరగకుండా సమస్య పరిష్కారం కాదని ఆయన చెప్పారు. దీనిపై ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరక కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.