: జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత... జేబుకు చిల్లు పెట్టేవి, మిగిల్చేవి!
దేశంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. ఏ ఇద్దరు కలిసినా ఒకే చర్చ. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత లాభమెంత? నష్టమెంత? దేని ధర పెరుగుతుంది? దేని ధర తగ్గుతుంది? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. జీఎస్టీ అమలులోకి వస్తే సామాన్యునిపై పడే ప్రభావంపై అన్ని టీవీ చానల్స్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఉత్పత్తులు, వస్తువుల ధరల్లో తగ్గుదల, పెరుగుదల ఎలా ఉంటుందంటే...
(ఉత్పత్తుల ధరలు సగటున పెరిగే, తగ్గే వివరాలు)
టెలిఫోన్ బిల్లు: జీఎస్టీకి ముందు రూ. 1,000 - రేపటి నుంచి రూ. 1,025
బీమా ప్రీమియం: జీఎస్టీకి ముందు రూ. 1,000 - రేపటి నుంచి రూ. 1,250
విమానం టికెట్: జీఎస్టీకి ముందు రూ. 5,000 - రేపటి నుంచి రూ. 4,900
రైలు టికెట్: జీఎస్టీకి ముందు రూ. 1,500 - రేపటి నుంచి రూ. 1,485
హోటల్ లో బస: జీఎస్టీకి ముందు రూ. 7,500 - రేపటి నుంచి రూ. 7,425
నాన్ ఏసీ రెస్టారెంట్ భోజనం: జీఎస్టీకి ముందు రూ. 1,000 - రేపటి నుంచి రూ. 970
ఏసీ రెస్టారెంట్ భోజనం: జీఎస్టీకి ముందు రూ. 1,000 - రేపటి నుంచి రూ. 1,030
సినిమా టికెట్: జీఎస్టీకి ముందు రూ. 80 - రేపటి నుంచి రూ. 82
మెడిసిన్: జీఎస్టీకి ముందు రూ. 500 - రేపటి నుంచి రూ. 505
పిజ్జా: జీఎస్టీకి ముందు రూ. 200 - రేపటి నుంచి రూ. 194
చిప్స్: జీఎస్టీకి ముందు రూ. 20 - రేపటి నుంచి రూ. 19.60
టీ: జీఎస్టీకి ముందు రూ. 20 - రేపటి నుంచి రూ. 19.40
కాఫీ: జీఎస్టీకి ముందు రూ. 50 - రేపటి నుంచి రూ. 51.50
బర్గర్: జీఎస్టీకి ముందు రూ. 100 - రేపటి నుంచి రూ. 97
వంట నూనె: జీఎస్టీకి ముందు రూ. 100 - రేపటి నుంచి రూ. 96
హెయిర్ ఆయిల్: జీఎస్టీకి ముందు రూ. 30 - రేపటి నుంచి రూ. 28.50
టూత్ పేస్టు: జీఎస్టీకి ముందు రూ. 50 - రేపటి నుంచి రూ. 47
సబ్బులు: జీఎస్టీకి ముందు రూ. 30 - రేపటి నుంచి రూ. 28.20
చెప్పులు, షూస్: జీఎస్టీకి ముందు రూ. 500 - రేపటి నుంచి రూ. 515
బ్రాండెడ్ దుస్తులు: జీఎస్టీకి ముందు రూ. 500 - రేపటి నుంచి రూ. 490
ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు: జీఎస్టీకి ముందు రూ. 30,000 - రేపటి నుంచి రూ. 31,200
ఫ్రిజ్: జీఎస్టీకి ముందు రూ. 15,000 - రేపటి నుంచి రూ. 15,600
ల్యాప్ టాప్: జీఎస్టీకి ముందు రూ. 20,000 - రేపటి నుంచి రూ. 20,200
వాషింగ్ మెషీన్: జీఎస్టీకి ముందు రూ. 25,000 - రేపటి నుంచి రూ. 25,600
మొబైల్ ఫోన్లు: జీఎస్టీకి ముందు రూ. 10,000 - రేపటి నుంచి రూ. 9,600
వ్యవసాయ ఉత్పత్తులు: జీఎస్టీకి ముందు రూ. 10,000 - రేపటి నుంచి రూ. 10,600
బడ్జెట్ ధరలో లభించే చిన్న కారు: జీఎస్టీకి ముందు రూ. 3 లక్షలు - రేపటి నుంచి రూ. 2.91 లక్షలు
లగ్జరీ కార్లు: జీఎస్టీకి ముందు రూ. 60 లక్షలు - రేపటి నుంచి రూ. 57.60 లక్షలు
బైక్: జీఎస్టీకి ముందు రూ. 60,000 - రేపటి నుంచి రూ. 60,600
స్కూటర్: జీఎస్టీకి ముందు రూ. 35,000 - రేపటి నుంచి రూ. 35,300