: ఏ1ను వదిలి ఏ2, ఏ3, ఏ5, ఏ12 నిందితులకు శిక్ష... అక్బరుద్దీన్ వర్గం ఆగ్రహం
2011లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పై దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడు, ఏ1గా ఉన్న పహిల్వాన్ కు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలనూ ప్రాసిక్యూషన్ ప్రవేశఫెట్టలేక పోయిందని, ఘటనా స్థలిలోనూ ఆయనకు ఎటువంటి వ్యతిరేక ఆధారాలు లభించని కారణంగానే పహిల్వాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తున్నామని న్యాయమూర్తి చెప్పారు. ఇక అక్బరుద్దన్ పై కత్తులతో దాడి చేసిన ఏ2 సలీం బిన్, ఏ3 అబ్దుల్లా యాఫై, ఏ5 అవద్ యాఫై, ఏ12 హసన్ బిన్ యాఫైలకు వ్యతిరేకంగా పలువురు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని కోర్టు పేర్కొంది. దోషులకు రేపు శిక్షలను ఖరారు చేస్తామని తెలిపింది. కాగా, ఈ తీర్పుపై అక్బరుద్దీన్ వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసలు దోషులను వదిలిపెట్టి, డబ్బు కోసం దాడికి దిగిన వారిని శిక్షిస్తున్నారని ఆరోపించింది.