: 'పోర్న్ స్టార్ తో సెల్ఫీ దిగాను... ఇలా 'పంచ్' పడింది'... వైరల్ అయిన అభిమాని ఫోటో!


తమ అభిమాన నటీ నటులను చూడాలని, వీలు కుదిరితే ఓ ఫోటో దిగాలని కోరుకోని అభిమానులుండరు. ఇక తన ముందు ఓ పోర్న్ స్టార్ వెళుతుంటే... ఉత్సాహంతో కూడిన తనలోని అభిమానాన్ని బయటపెట్టాడో యువకుడు. ఆపై ఆమెతో ఓ 'పంచ్' తిన్నాడు. అంతటితో ఊరుకున్నాడా? ఆమెతో ఫోటో దిగానని, ఇలా ఎడమ ముఖంపై 'పంచ్' పడిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులు అలా అలా సదరు నటికి కూడా చేరడంతో, ఆమె సైతం స్పందించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, యూఎస్ లోని టెక్సాస్ లో పోర్న్ చిత్రాల్లో నటించిన మియా ఖలిఫా అనే యువతి నడిచి వెళుతుంటే, హడ్ స్పెత్ అనే యువకుడు ఆమెను చూశాడు. ఆమెతో సెల్ఫీ దిగాలని అనుకున్నాడు. అనుమతి తీసుకోకుండానే సెల్ఫీలు తీసుకుంటుంటే, ఖలీఫా ఓ గట్టి పంచ్ ఇచ్చింది. అయినా, పని పూర్తి చేసుకుని వెళ్లిన హడ్ స్పెత్, ఆ ఫోటోలను ట్విట్టర్ లో పెట్టాడు. దీనిపై ఖలీఫా స్పందిస్తూ, సదరు యువకుడు, తన మొహానికి అతి దగ్గరగా వస్తుండటం చూసి, ఓ కిక్ ఇచ్చానని తెలిపింది. ఇక ఈ ట్వీట్ పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News