: సతీసమేతంగా ఇండియాకు రండి... మరచిపోలేని ఆతిథ్యమిస్తా: ట్రంప్ తో మోదీ


భార్య మెలానియా సహా కుటుంబ సభ్యులందరితో కలసి భారత పర్యటనకు రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. "మీరు, మీ కుటుంబ సభ్యులతో పాటు ఇండియాకు రావాల్సిందిగా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు మా దేశంలో ఆహ్వానం పలికి అతిథ్యమిచ్చే అవకాశాన్ని నాకు ఇవ్వండి" అని మోదీ ట్రంప్ ను కోరారు. తామిద్దరి మధ్యా జరిగిన చర్చల అనంతరం, వైట్‌ హౌస్‌ లోని రోజ్‌ గార్డెన్స్‌ లో ట్రంప్‌ తో కలిసి సంయుక్త మీడియా ప్రకటన చేసే వేళ, మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు వస్తే అది మరచిపోలేని పర్యటన అవుతుందని మోదీ చెప్పారు.

  • Loading...

More Telugu News