: మూడు రోజులుగా కేసీఆర్ కు పరీక్షలు.. నేడే ఆపరేషన్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఢిల్లీలో నేడు కంటి ఆపరేషన్ ను నిర్వహించనున్నారు. డాక్టర్ సచ్ దేవ్ ఆధ్వర్యంలో ఆయనకు ఆపరేషన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా ఆయనకు పరీక్షలు నిర్వహించారు. చుక్కల మందు వేశారు. ఆపరేషన్ ద్వారా ఆయన కుడి కంటిపై పొరను తొలగించనున్నారు.
గతంలో ఢిల్లీకి వెళ్లినప్పుడే కంటి ఆపరేషన్ చేయించుకోవాలని కేసీఆర్ అనుకున్నారు. అయితే మందులతోనే పొరను తొలగించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. తాజాగా ఆయనకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలని సూచించారు. కేసీఆర్ కూడా ఆపరేషన్ కు అంగీకరించడంతో... ఈ రోజు శస్త్రచికిత్సను నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ఆపరేషన్ జరుగుతుంది. శస్త్రచికిత్స తర్వాత మరో నాలుగు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు.