: కోచ్ అవతారమెత్తిన మహేంద్ర సింగ్ ధోనీ.. మీరూ చూడండి!
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌తో మొదటి మ్యాచ్ ఆడుతోన్న విషయం తెలిసిందే. అయితే, నిన్న చేసిన ప్రాక్టీసులో టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోచ్‌లా కొత్త కుర్రాడికి ట్రైనింగ్ ఇచ్చాడు. వెస్టిండీస్ టూర్ కోసం యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆ కొత్త కుర్రాడు ధోనీ తర్వాత ధోనీ అంతటి వాడు అవ్వాలని సెలెక్టర్లు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ లేకుండానే ఆడుతోంది. వికెట్ కీపర్‌గా ధోనీకి ఎంతగానో అనుభవం ఉంది. అందుకే ధోనీ ఆ కొత్త కుర్రాడికి మెలకువలు నేర్పించాడు. ధోనీ కోచ్ లా సీరియస్ గా శిక్షణనిస్తుండగా తీసిన ఓ ఫొటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో ధోనీలాగే పంత్ రాణించాడు. ఈ ఫొటో అభిమానులను అలరిస్తోంది.