: భారత్, వెస్టిండీస్ వన్డే: 10 ఓవర్లకి టీమిండియా స్కోరు 47
వెస్టిండీస్ టూర్‌లో భాగంగా టీమిండియా ఈ రోజు మొదటి మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్లుగా రహానే, శిఖర్ ధావన్‌లు క్రీజులోకి వచ్చారు. పది ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. రహానే 31 బంతుల్లో 22 పరుగులు, శిఖర్ ధావన్ 29 బంతుల్లో 23 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్ లేకుండానే టీమిండియా ఈ సిరీస్ ఆడుతోంది.