: ‘చికెన్‌ తినడానికి వారం రోజులు సెలవు ఇవ్వగలరు’... అధికారులకు రైల్వే ఉద్యోగి తమాషా లీవ్ లెటర్


ఓ ఉద్యోగి చికెన్‌ తినడానికి త‌మ సంస్థ‌ను సెలవు కోరిన విచిత్ర సంఘ‌ట‌న ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్‌మాస్టర్‌గా ప‌నిచేస్తున్న‌ పంకజ్‌రాజ్ త‌మ అధికారుల‌కు పంపిన ఆ లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో దేశ వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది. శ్రావణమాసంలో హిందువులు మాంసాహారాన్ని ముట్టర‌న్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో త‌మ పై అధికారులు పంకజ్‌రాజ్ లేఖ రాస్తూ, ...శ్రావణ మాసం త్వరలో ప్రారంభం కాబోతుంది కాబ‌ట్టి, ఆ సమయంలో తాము చికెన్‌ తినబోమ‌ని, కాబ‌ట్టి తన‌కు జూన్‌ 20 నుంచి వారం రోజుల పాటు సెలవు ఇవ్వాల‌ని కోరాడు. శ్రావ‌ణ మాసం ప్రారంభం కాక‌ముందే తాను బాగా చికెన్‌ తిని పనిచేసేందుకు శక్తిని తెచ్చుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. గతంలో సినిమాలు చూడడానికి కూడా కొందరు ఉద్యోగులు లీవ్ లెటర్ లు ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. చికెన్ తినాలంటూ ఈ రైల్వే ఉద్యోగి చేసుకున్న వినతిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

  • Loading...

More Telugu News