: ఫ్లిప్ కార్ట్ లో ‘మోటో ఎక్స్ ఫోర్స్’ మోడల్ ధరపై భారీ తగ్గింపు
రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న మోటో ఎక్స్ ఫోర్స్ మోడళ్లను ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో అందిస్తున్నట్లు మొబైల్ తయారీ సంస్థ మోటొరోలా తెలిపింది. ఈ ఆఫర్ ప్రకారం మోటో ఎక్స్ ఫోర్స్ 64 జీబీ వేరియంట్ పై 58శాతం వరకు తగ్గింపు ధరతో రూ.15,599కే లభిస్తోంది. ఇక 32జీబీ వేరియంట్ మోటో ఎక్స్ ఫోర్స్‌ను 62శాతం తగ్గింపు ధరతో అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్ రూ.12,999కే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.4 అంగుళాల హెచ్డీ డిస్ప్లేతో 3జీబీ ర్యామ్( వేరియంట్ 1: స్టోరేజ్ 64జీబీ, వేరియంట్-2 స్టోరేజ్ 32జీబీ), 3760 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 21 వెనుక కెమెరా, 5ఎంపీ ముందు కెమెరా ఫీచర్లుగా ఉన్నాయి.