: ఆ పాప క్షేమం...కిడ్నాప్ కాలేదు: పోలీసులు


హైదరాబాదులోని బాచుపల్లిలో అపహరణకు గురైందనుకున్న ఐదేళ్ల బాలిక ఆచూకీ లభ్యమైంది. బాచుపల్లి రెయిన్‌ బో కాలనీకి చెందిన ఐదేళ్ల జనహిత దగ్గర్లోని ప్లే స్కూల్ లో చదువుకుంటోంది. రోజూలానే ఉదయం కూడా స్కూలుకు బయల్దేరింది. అనంతరం బాలిక ఇంకా రాలేదంటూ తల్లిదండ్రులకు స్కూలు నుంచి సమాచారం అందింది. దీంతో బెంబేలెత్తిపోయిన తల్లిదండ్రులు కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, అన్ని స్టేషన్లకు సమాచారమిచ్చి, తనిఖీలు నిర్వహిస్తూనే, రెయిన్ బో కాలనీ పరిసరాల్లోని సీసీ టీవీ పుటేజ్ ను పరీశిలించారు. ఈ సందర్భంగా బాలిక బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో మరో స్కూల్ కి చెందిన బస్సు వచ్చింది. అందులో సిబ్బంది ఆ బాలిక తమ పాఠశాలలోనే చదువుతోందని భావించి, తమ బస్సులోకి ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. విచారణలో ఈ విషయం వెలుగు చూడడంతో, వేరే స్కూల్ లో సురక్షితంగా వున్న బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. 

  • Loading...

More Telugu News