: ప్రొకబడ్డీలో సచిన్ టెండూల్కర్ జట్టు పేరు ఇదే!


జూలై 28న ప్రొకబడ్డీ లీగ్ సీజన్-5 ప్రారంభం కానుంది. ఇప్పటిదాకా ఈ లీగ్ లో ఎనిమిది జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఇప్పుడు జట్ల సంఖ్య 12కి పెరిగింది. కొత్తగా తమిళనాడు, హర్యాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ జట్లు బరిలోకి దిగబోతున్నాయి. తమిళనాడు జట్టుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తమ జట్టు పేరును సచిన్ ప్రకటించాడు. తమ జట్టుకు 'తమిళ్ తలైవాస్' అనే పేరును పెట్టినట్టు ట్విట్టర్ ద్వారా సచిన్ తెలిపాడు. ఈ పేరును ప్రకటించేందుకు తాను ఎంతో గర్విస్తున్నానని చెప్పాడు. సీజన్-5లో 12 జట్ల మధ్య సుమారు 130 మ్యాచ్ లు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News