: ఇక నువ్వు హ్యాపీగా ఉండు... దానికి టార్చర్ చూపిద్దాం: శిరీషతో శ్రవణ్ ఫోన్ సంభాషణ వెలుగులోకి
బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు అత్యంత కీలకంగా భావిస్తున్న ఓ ఫోన్ సంభాషణ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్ లో రాజీవ్ స్నేహితుడు శ్రవణ్ తో అత్యంత సన్నిహితంగా 'డార్లింగ్' అంటూ సంబోధిస్తూ మాట్లాడిన శిరీష, రాజీవ్ కు, మరో యువతి తేజస్వినికి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. తేజస్విని తనకు 'ఎనిమీ' అంటూ తేజస్విని, రాజీవ్ లు ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారో వాయిస్ రికార్డు చేసి వినిపించాలని సూచించింది. "వాడు ఇందాక మాట్లాడింది విన్నావుగా... ఏం చెప్పాడు?" అంటూ ప్రశ్నించింది. శిరీష మాటలకు సరేనన్న శ్రవణ్, "ఇక నువ్వు హ్యాపీగా ఉండు... దానికి టార్చర్ చూపిద్దాం" అని అనడం కూడా ఈ సంభాషణలో ఉంది. రాజీవ్ ఫోన్ లోని రికార్డింగ్ ను ఎలాగైనా తనకు పంపాలని కోరింది. కాగా, పోలీసులకు మిస్టరీగా మారిన కేసును సాధ్యమైనంత త్వరగా ఛేదించాలన్న ఉద్దేశంతో పోలీసులు మరిన్ని ఫోన్ సంభాషణలను పరిశీలిస్తున్నారు.