: మా క్రికెట్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది: పాకిస్థాన్ మీడియా
నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను పాకిస్థాన్ చిత్తుగా ఓడించడంతో పాక్ మీడియా తమ దేశ జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అన్ని వార్తా పత్రికల్లోనూ మొదటి పేజీల్లో.. ఛాంపియన్స్ ట్రోఫీతో ఆటగాళ్లు సంబరాలు జరుపుకొంటున్న ఫొటోలు కనిపించాయి. గ్రూప్ దశలో భారత్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్.. నిన్న భారత్‌పై అద్భుతంగా ఆడి, గెలిచి ప్రతీకారం తీర్చుకుందని ఆ పత్రికలు పేర్కొన్నాయి. తమ జట్టు మొదటి మ్యాచులో తప్ప అని మ్యాచుల్లోనూ అదరగొట్టేసిందని కితాబిచ్చాయి. ఈ విజయంతో తమ దేశ అభిమానుల కల నెరవేరిందని, భారత్‌పై సాధించిన విజయం అద్భుత విజయం అని పేర్కొన్నాయి.