: ఏపీ, తెలంగాణ, బీహార్, తమిళనాడు సీఎంలకు మోదీ ఫోన్.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవిద్ పేరును ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు మద్దతు తెలపాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, తమిళనాడు ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. మోదీ తనతో మాట్లాడిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. కాగా, ఈ నెల 23న రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవిద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.