: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్... అద్వానీకి మొండిచేయి!


ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ఆయన బీహార్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. 12 ఏళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. దళితుల హక్కుల కోసం పోరాడిన రామ్ నాథ్... బీజేపీలో కీలకమైన దళిత నేతగా ఎదిగారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కూడా ఆయన న్యాయవాదిగా పని చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే నేపథ్యంలో, ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం నేడు భేటీ అయింది. అనంతరం రామ్ నాథ్ ను తమ అభ్యర్థిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియా సమావేశంలో ప్రకటించారు.

మరోవైపు, పార్టీ సీనియర్ నేత అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనున్నట్లు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ రామ్ నాథ్ పేరును అమిత్ షా ప్రకటించారు. దీంతో, అద్వానీకి చివరిసారిగా కూడా నిరాశే ఎదురైంది. రామ్ నాథ్ పేరును ప్రకటించడంతో... బీజేపీలో అద్వానీ శకం ఇక ముగిసినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News