: యువీ, ధోనీ అవుట్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా!


ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా మరో రెండు వికెట్లు కోల్పోయింది. షాదాబ్ బౌలింగ్ లో యువరాజ్ సింగ్ (22) ఎల్బీడబ్ల్యూ కాగా, హసన్ అలీ బౌలింగ్ లో ఇమాద్ వసీంకు క్యాచ్ ఇచ్చి ధోనీ (4) అవుటయ్యాడు. కేవలం 15.3 ఓవర్లలో 63 పరుగులు చేసిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది. క్రీజ్ లో జాదవ్ (5), పాండ్యా(4)లు ఉన్నారు. కాగా, టీమిండియా వికెట్లు వరుస పెట్టి పడిపోతుండటం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. 

  • Loading...

More Telugu News