: ఛాంపియన్స్ ట్రోఫీ.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. కాగా, భారత్-పాకిస్థాన్ మధ్య అంతిమ పోరును తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే మైదానానికి చేరుకున్నారు. తమ అభిమాన క్రికెటర్లకు సంబంధించిన చిత్రాలతో పాటు జాతీయ పతాకాలను అభిమానులు చేత పట్టుకున్నారు.