: భారత్, పాక్ క్రికెట్ అభిమానులకు ఒక్క ఫోటోతో చక్కని సందేశం పంపిన ధోనీ!


మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దేశంలోని మీడియా ఛానెళ్లన్నీ ఫైనల్ పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పాక్ తో మ్యాచ్ అంటే ఆటకాదని, ఆటకంటే ఎక్కువైన భావోద్వేగమని, భారత్ గెలవాల్సిందేనని అభిమానులు గొంతు చించుకుంటున్నారు. మరికొందరు పూజలు చేస్తున్నారు. ఇంకొందరు బాజాభజంత్రీలతో శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమిండియా వీరాభిమానులంతా బారత్ గెలవాలని ఆవేశంతో ఊగిపోతున్నారు.

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాక్, భారత్ క్రికెట్ అభిమానులకు ఒక ఫోటోతో చక్కని సందేశం పంపాడు. పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ కుమారుడు అబ్దుల్లాను ధోనీ ఎత్తుకుని ఆడించాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాదాలు, విభేదాలు దేశాల మధ్యే కానీ... మనుషుల మధ్య కాదని ఈ దృశ్యంతో నిరూపించాడని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News