: బోల్తా పడిన ప్రైవేటు బస్సు.. అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చిన ప్రయాణికులు


ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి రేపల్లె వెళ్తున్న ప్రైవేటు బస్సు మోపిదేవి మండలం పెదప్రోలు వద్ద 216 జాతీయ రహదారిపై మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు బోల్తా పడిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా అద్దాలు పగులగొట్టుకుని క్షేమంగా బయటకు వచ్చారు. వీరిలో కొందరు గాయపడ్డారు. గతంలో ఇదే మలుపు వద్ద చాలా ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు. 

  • Loading...

More Telugu News