: ఈ వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియదు: కమలహాసన్


విలక్షణ నటుడు కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వరూపం సినిమాకి సీక్వెల్ గా విశ్వరూపం-2 తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఈ నేపథ్యంలో జూన్ 23న సినిమాకు సంబంధించిన టీజర్ ను కమల్ విడుదల చేయనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలపై స్పందించిన కమల్... ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థంకావడం లేదని చెప్పారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంస్థ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు ఇలాంటి వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరారు. దీపావళికి ఈ సినిమాను విడుదల చేసేందుకు కమల్ సన్నాహకాలు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News