: న్యూయార్క్ మాకు ఎంతో దూరంలో లేదు.. అణుదాడికి సమయం దగ్గర పడింది!: అమెరికాకు మరోసారి ఉత్తర కొరియా వార్నింగ్!
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అమెరికాను చేరుకోగల ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ తయారీ చివరి దశకు చేరుకుందంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. ఉత్తర కొరియాకు అది అసాధ్యమని ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ పై ఉత్తర కొరియా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. అమెరికాపై అణుదాడి చేయడానికి సమయం దగ్గర పడిందని ఉత్తర కొరియాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. న్యూయార్క్ తమకు ఎంతో దూరంలో లేదని... కేవలం 10,400 కిలోమీటర్ల దూరంలోనే ఉందని... ఈ దూరం తమకు ఓ లెక్కకాదని ఆయన చెప్పారు. ఉత్తర కొరియాను తక్కువగా అంచనా వేస్తున్నారని... దీనికి అమెరికా మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.