జాక్ పాట్ అంటే ఇదే ... లాటరీలో 2,888 కోట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జాక్ పాట్ అంటే ఇదే ... లాటరీలో 2,888 కోట్లు!

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. అమెరికాలో ప్రతిష్ఠాత్మక పవర్ బాల్ కంపెనీ నిర్వహించే లాటరీని కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి గెలుచుకున్నాడని ఆ సంస్థ ప్రకటించింది. అతని భద్రత దృష్ట్యా అతని వివరాలు వెల్లడించడం లేదని లాటరీ నిర్వాహకులు తెలిపారు. అతను ఈ లాటరీలో ఏకంగా 448 మిలియన్‌ డాలర్లు  (2,888 కోట్ల రూపాయలు) గెలుచుకున్నారని తెలిపారు. ఈ మొత్తంలోంచి స్థానిక పన్నులు, ఇతర చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని విజేతకు అందజేస్తామని తెలిపారు. అలాగే ఈ లాటరీ టికెట్ ను కాలిఫోర్నియాలోని రివర్‌ సైడ్‌ కౌంటీ అనే ప్రాంతంలోని దుకాణం నుంచి విజేత కొనుగోలు చేశారని, అందువల్ల ఈ దుకాణదారులకు సుమారు కోటిన్నర రూపాయలు అందజేయనున్నామని వారు తెలిపారు. అమెరికాతో పాటు మరికొన్ని పాశ్చాత్య దేశాల్లో లాటరీల నిర్వహణ అధికారికం. తాజాగా కేరళలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లాటరీ వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

More Telugu News