: సినారె మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం


ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి మృతి పట్ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న మృతి సాహిత్య ప్ర‌పంచానికి తీర‌నిలోట‌ని మోదీ పేరిట పీఎంవో ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. సినారె కుటుంబ స‌భ్యుల‌కు తాను ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు మోదీ చెప్పారు. ఆయ‌న సాహిత్యంలో చేసిన కృషి న‌వత‌రానికి ఆద‌ర్శ‌మ‌ని చెప్పారు. సి.నారాయణరెడ్డి మృతి పట్ల అన్ని రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ, సాహిత్య రంగాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.           

  • Loading...

More Telugu News