: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి... కలకలం రేపిన యువకుడు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నివాసంలోకి మహ్మద్ షిరౌద్దీన్(25) అనే యువకుడు చొరబడడానికి ప్రయత్నం చేసి అలజడి రేపాడు. బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో షిరౌద్దీన్ లోపలికి వెళ్లాడు. గమనించిన స్థానికులు సెక్యూరిటీ గార్డుని పిలవడంతో అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తేల్చారు. దీంతో అతడిపై ఎటువంటి కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రం విడుదలకు సిద్ధం కావడంతో ఆ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో సల్మాన్ పాల్గొంటున్నారు.