: షాకింగ్... ఆ సంస్థ నుంచి రుణం కావాలంటే నగ్న చిత్రాలు పంపాలట!


మహారాష్ట్రలోని థాణెలో బీపీవో కంపెనీ రెకాన్‌ ఎంటర్‌ ప్రైజెస్ పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ సంస్థ కార్యాలయంపై గడచిన రెండు రోజులుగా దాడులు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకుని షాక్ కు గురయ్యారు. రెకాన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ రుణాలు ఇస్తుంటుంది. అయితే 1,000 నుంచి 5000 డాలర్ల మధ్య వివిధ రకాల రుణాలిప్పించేందుకు 20 నుంచి 30 శాతం కమీషన్‌ తీసుకునేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. అంతే కాకుండా, లోన్ కు ష్యూరిటీ అంటూ పలు పత్రాలతో పాటు నగ్న ఫోటోలు, వీడియోలు పంపాలని వినియోగదారులను డిమాండ్ చేశారు. అయితే లోన్‌ అవసరమైన పలువురు వినియోగదారులు అలా ఫోటోలు, వీడియోలు పంపడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు వాటిని చూసి, షాక్ తిన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ఆ సంస్థపై కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News