: మహా సంకల్ప ప్రతిజ్ఞకు ముందే వెళ్లిపోయిన భూమా అఖిలప్రియ!


నవనిర్మాణదీక్ష ముగియడంతో కాకినాడలో మహా సంకల్ప ప్రతిజ్ఞను సీఎం చంద్రబాబు ఈ రోజు చేశారు. ఆ తర్వాత ఆయా జిల్లాల వారీగా ఈ ప్రతిజ్ఞను చేయడం జరిగింది. అయితే, కర్నూలు జిల్లా నంద్యాలలో మాత్రం మహా సంకల్ప ప్రతిజ్ఞకు ముందుగానే మంత్రి భూమా అఖిల ప్రియ వెళ్లిపోయారు. ఈ ప్రతిజ్ఞకు సంబంధించి నంద్యాలలో  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ ఏర్పాట్లు చేసిన హాల్ లో కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతో అఖిల ప్రియ వెళ్లిపోయినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News