: మహా యజ్ఞంలో మన మంత్రం ‘ప్రజలే ముందు’: సీఎం చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా నవనిర్మాణదీక్ష ముగిసిన సందర్భంగా కాకినాడలో మహా సంకల్పం ప్రతిజ్ఞను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేయించారు. ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అని ఎన్టీఆర్ ఇచ్చిన సందేశం నుంచి స్ఫూర్తిని పొందుతూ, ఆర్థిక సంస్కరణల ఫలాలను ప్రజలందరికీ అందించి, పేదరికరం లేని, ఆర్థిక అసమానతలు లేని ప్రశాంత, సురక్షిత,ఆనందదాయకమైన సమాజ నిర్మాణమే కర్తవ్యంగా పని చేస్తానని మహాసంకల్పం చేస్తున్నానని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు మహా యజ్ఞంలో మన మంత్రం ‘ప్రజలే ముందు’, దీనిని మనసా,వాచా మహా సంకల్పం చేస్తున్నానని అన్నారు. మహా సంక్పలానికి కాకినాడ వేదిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.