: రవీంద్ర జడేజా తండ్రయ్యాడు.. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి!
టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా తండ్రి అయ్యాడు. జడేజా భార్య రీవా సొలాంకి ఈ రోజు ఉదయం ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ నిమిత్తం ఇంగ్లాండ్ లో ఉన్న జడేజాకు ఈ విషయం తెలియడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా జడేజాకు సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 2016 ఏప్రిల్ లో జడేజా-రీవా సొలాంకి వివాహం జరిగింది. రీవా సొలాంకి గర్భవతి అయిన విషయం ఈ ఏడాది మార్చిలో అభిమానులకు తెలిసింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిమిత్తం గర్భవతి అయిన తన భార్యను వదిలి వెళ్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా పేర్కొనడం తెలిసిందే.