: దాసరి సంతాప సభ ఆలస్యం కావడానికి కారణమిదే!


తెలుగు సినీ రంగానికి పెద్దదిక్కుగా ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు ఇటీవల తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే, సినీ పరిశ్రమ తరపున ఆయనకు ఇంతవరకు సంతాప సభను నిర్వహించలేదు. సినీ ప్రముఖుల మధ్య ఉన్న విభేదాలే దీనికి కారణమంటూ పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, దీనిపై నిర్మాత సి.కల్యాణ్ వివరణ ఇచ్చారు. 80వ దశకంలో స్టార్స్ గా ఉన్న చాలా మంది ప్రస్తుతం చైనాలో ఉన్నారని... వారు అందుబాటులో లేని కారణంగానే ఇంతవరకు సంతాప సభను నిర్వహించలేదని ఆయన తెలిపారు. 10వ తేదీన సంతాప సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు సినీ పరిశ్రమకు చెందినవారంతా హాజరవుతారని... తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా చైనాలో ఉన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News