: రక్షించమంటూ... సమాధిలోంచి అన్నకు ఫోన్ చేసిన వ్యాపారి!
రష్యా రాజధాని మాస్కోలో సమాధి నుంచి ఒక వ్యక్తి తన అన్నకు ఫోన్ చేసిన ఘటన ఆసక్తి రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...కిక్ మెట్ అనే వ్యాపారి తన వ్యాపారం నిమిత్తం పలువురి నుంచి అప్పులు చేశాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆయన చేసిన అప్పులు తీర్చలేకపోయారు. దీంతో ఆయనను దొరకబుచ్చుకున్న అప్పుల వాళ్లు చితక్కొట్టి, ఆయనను సజీవంగా సమాధి చేశారు. దీంతో వ్యాపారి తన జేబులోని సెల్ ఫోన్ తో సమాధిలోంచి సోదరుడు ఇస్మాయిల్ కు ఫోన్ చేసి, తనను సజీవ సమాధి చేశారని చెప్పాడు. దీంతో ఇస్మాయిల్ హుటాహుటీన సంఘటనా స్థలికి చేరుకుని సమాధిలోంచి తమ్ముడ్ని వెలికి తీశారు. సుమారు నాలుగు గంటలపాటు భూమిలో ఉన్న కిక్ మెట్ అప్పటికే స్పృహ కోల్పోయాడు. దీంతో తమ్ముడిని ఆసుపత్రికి తరలించి, తమ్ముడు చేసిన అప్పుల వివరాలు తెలుసుకుని, వాటిని తీర్చి తమ్ముడ్ని బతికించుకున్నాడు.