: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని జైలుకి పంపడంతో.. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న బాధితులు!

పలు ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడిన ఆరోపణలపై తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత బోజగుట్టలోని పలువురు సంబరాలు చేసుకున్నారు. దీపక్ తమను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, కోర్టు కేసులతో భయాందోళనలకు గురి చేశారని, బస్తీలను ఖాళీ చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరించేవాడని స్థానికులు చెప్పారు. దీపక్ అరెస్ట్ తరువాత మిఠాయిలు పంచుకుని, టపాకాయలు కాల్చి పండగ చేసుకున్నారు. ఈ ప్రాంత కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ తో పాటు పలువురు స్థానిక నేతలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. తామెంతో కాలంగా ఇదే ప్రాంతంలో ఉంటున్నామని, తమను ఇబ్బందులు పెట్టిన దీపక్ రెడ్డి అరెస్ట్ తో ఊరట పొందామని, ఇక్కడే తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని స్థానికులు తెలిపారు.

More Telugu News