: రాంగోపాల్ వర్మకి సారీతో పాటు థ్యాంక్స్ చెబుతున్నాను: సినీ గేయ రచయిత సిరాశ్రీ


ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కి తాను సారీతో పాటు థ్యాంక్స్ చెబుతున్నాన‌ని సినీ గేయ ర‌చ‌యిత సిరాశ్రీ అన్నారు. సైమా ఫిల్మ్ అవార్డ్స్ వంటి గొప్ప  వేడుక‌లో ఈ సారి ఉత్త‌మ గేయ ర‌చ‌యిత కేటగిరీలో రాంగోపాల్ వ‌ర్మ‌ తీసిన ‘వంగవీటి’ సినిమాలో తాను రాసిన పాటను గుర్తించి త‌న‌ను నామినీగా ఎంపిక చేశార‌ని ఆయ‌న తెలిపారు. ఈ సినిమాలో పాట రాసేందుకు రాంగోపాల్ వర్మ త‌న‌ను ఎంచుకున్నార‌ని ఆయ‌న అన్నారు. అయితే, ఈ పాటను వర్మ కాకుండా ప్రొఫెషనల్ సింగర్ పాడితే బాగుండేది అని అప్పట్లో తాను అనుకున్నానని, కానీ ఈ అవార్డుకు తన‌ను నామినీగా ఎంపిక చేసిన‌ తర్వాత వ‌ర్మ‌కి సారీ, థ్యాంక్స్ రెండూ చెప్పేస్తున్నానని సిరాశ్రీ తన ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

 


  • Loading...

More Telugu News