: బంగారంపై 3 శాతం పన్ను: జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు


ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్య‌క్ష‌త‌న ఈ రోజు జీఎస్టీ 15వ సమావేశం జ‌రిగింది. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్న ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ స‌మావేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేంద‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణ‌యాల ప్ర‌కారం ప‌లు వ‌స్తువులపై విధించిన ప‌న్నుల వివ‌రాలు...

  • బంగారంపై- 3 శాతం
  • రెడీమెడ్ దుస్తుల‌పై- 12 శాతం
  • నూలు, మిల్లు వ‌స్త్రాల‌పై- 5 శాతం
  • రూ.500లోపు ఉన్న పాద‌ర‌క్ష‌ల‌పై- 5 శాతం
  • రూ.500 దాటిన పాద‌ర‌క్ష‌ల‌పై 18 శాతం
ఇత‌ర వ‌స్తువుల‌పై విధించాల్సిన ప‌న్నుల అంశంపై కూడా ఈ భేటీలో చ‌ర్చించారు.

  • Loading...

More Telugu News