: భారత్ లోకి లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రవేశించారు: నిఘా వర్గాల హెచ్చరిక
భారత్‌లో భారీ ఉగ్రదాడికి లష్కరే తోయిబా ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. ఆ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ ఒకరు ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిపాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలు భద్రతను పెంచాలని సూచించాయి. మరోవైపు ఉగ్రవాదులు ప్రవేశించారన్న సమాచారంతో ఈ రోజు ఉదయం నుంచి జమ్ముకశ్మీర్‌లోని కుప్వార జిల్లాలోని అటవీ ప్రాంతంలో భారత ఆర్మీ భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.