: ఆధార్ లేకుంటే బువ్వ లేనట్టే.. స్పష్టం చేసిన యోగి ప్రభుత్వం!
మధ్యాహ్న భోజనం విషయంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆధార్ లేని విద్యార్థులకు జూలై 1 నుంచి మధ్యాహ్న భోజనం పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఆధార్ కార్డు ఉంటేనే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి అర్హులు అవుతారని, కార్డులు లేని, నంబర్లు ఇవ్వని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం వర్తింపచేయరాదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయంటూ ప్రాథమిక విద్య డైరెక్టర్ సర్వేంద్ర వికర్ణ్ సింగ్ అన్ని ప్రాథమిక పాఠశాలలకు లేఖలు రాశారు.
విద్యార్థులకు ఆధార్ కార్డుల కోసం స్కూళ్లలో చేపట్టిన ఎన్‌రోల్‌మెంట్ ప్రస్తుతం నత్తనడకన సాగుతోంది. ప్రాథమిక విద్యావిభాగానికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ దాదాపు 20 శాతం మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవన్నారు. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం కనుక జూలై 1 నుంచి కఠినంగా అమలైతే డ్రాపౌట్స్ పెరగడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు.