: నేడు ఏపీ నవనిర్మాణ దీక్ష.. విజయవాడలో ముఖ్యమంత్రి దీక్ష ప్రమాణం!
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర నవనిర్మాణ దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం 13 జిల్లాలతో ఏపీ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవనిర్మాణ దీక్షను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టనున్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో చంద్రబాబు రాష్ట్ర నవనిర్మాణ దీక్ష ప్రమాణం చేయనున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేల సారథ్యంలో ఏపీలోని 13 జిల్లాల్లో నవ నిర్మాణ దీక్ష ప్రమాణం చేస్తారు. విభజన కసిని రాష్ట్రాభివృద్ధిలో చూపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.