: సల్మాన్ విచిత్ర ప్రవర్తన: జీన్స్ ప్యాంట్ దారాన్ని తెంచేసి నోట్లో పెట్టుకొని నమిలేసిన కండలవీరుడు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం తన కొత్త సినిమా ట్యూబ్ లైట్ ప్రమోషన్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో మీడియా సమావేశాల్లోను, పలు కార్యక్రమాల్లోను పాల్గొంటున్నాడు. ఇటీవల ఆయన ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఆయన ఏదో విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ ఉన్నట్లు కనిపించాడు. అంతలోనే తన జీన్స్ ప్యాంట్ నుంచి ఓ దారం తెంపేసి నోట్లో పెట్టుకున్నాడు. ఆ దారాన్ని నములుతూనే తన ప్యాంటు నుంచి మరో దారాన్ని తెంచాలని చూశాడు.. ఒక వ్యక్తి ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోని ఆన్‌లైన్‌లో పెట్టడంతో ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ చూడండి...