: త్వరలో మార్కెట్లోకి కొత్త నోటు.. రూపాయి నోటుకు పునర్వైభవం!
ముద్దుగా ఉండే రూపాయి నోటుకు మళ్లీ పునర్వైభవం రానుంది. త్వరలోనే వీటిని తిరిగి చలామణిలోకి తీసుకురావాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. రూపాయి నోటు ప్రింటింగ్‌ను 1994లోనే ఆపేసిన ప్రభుత్వం 2015లో తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం మింట్ రూపాయి నాణేలను పెద్ద ఎత్తున తయారుచేస్తుండడంతో అవే చలామణిలో ఉన్నాయి. తాజాగా రూపాయి నోట్లను తిరిగి చలామణిలోకి తీసుకురానున్నట్టు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కొత్త రూపాయి నోట్లపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ సంతకం ఉంటుంది. మిగతా నోట్లపైన మాత్రం ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. కొత్త నోటు ప్రధానంగా పింక్ గ్రీన్‌లో ఉంటుందని రిజర్వు బ్యాంకు తెలిపింది.