: మెట్రో ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేతపై స్టే ఇచ్చేది లేదన్న బాంబే హైకోర్టు!
ముంబైలోని మెట్రో-3 ప్రాజెక్టు కోసం చెట్లను నరికివేయకుండా స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు అందుకు నిరాకరించింది. ముందస్తు అనుమతులు, ప్లాన్‌లో భాగంగానే చెట్లను నరికివేయనున్నట్టు బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ), ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్) కోర్టుకు విన్నవించడంతో చెట్ల నరికివేతపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మెట్రో ప్రాజెక్టు కోసం చెట్లను యథేచ్ఛగా నరికివేయడం వలన వాతావరణంలో అసమతౌల్యత ఏర్పడుతుందని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేతపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసిన కోర్టు తదుపరి విచారణను జూన్ 5కి వాయిదా వేసింది.