: ట్రంప్ దురహంకారం.. మరో దేశాధినేతను వెనక్కి తోసేశారు.. వీడియో వైరల్


వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. అగ్రదేశానికి అధినేతను అనే అహంకారం వల్లో లేక, సహజసిద్ధంగా తనకు వచ్చిన దూకుడు వల్లో కాని... ఏకంగా ఓ దేశ ప్రధానినే వెనక్కు తోసేశారు. బ్రస్సెల్స్ లోని నాటో హెడ్ క్వార్టర్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇతర దేశాధినేతలతో కలసి నడుస్తున్న సమయంలో, తన ముందు నడుస్తున్న మాంటెనెగ్రో దేశ ప్రధాని డస్కో మార్కోవిక్ ను ఆయన పక్కకు నెట్టి, ముందుకు వచ్చి నిలబడ్డారు. ఫొటోలకు పోజులిచ్చే సమయంలో ఇది జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

  • Loading...

More Telugu News