: ఒడిశా కుర్రాడి అద్భుత సృష్టి.. భారత్-పాక్ సరిహద్దుల్లో కాపలా కోసం రోబో తయారీ!


ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన కుర్రాడు హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన దీనిని భారత్-పాక్ సరిహద్దుల్లో గస్తీ కోసం ఉపయోగించవచ్చని అంటున్నాడు. అలాగే డిఫెన్స్, ఆటోమేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేషన్, తయారీ రంగాల్లోనూ దీనిని ఉపయోగించవచ్చని చెబుతున్నాడు.

బాలాసోర్ జిల్లాలోని సంతరగడియా గ్రామానికి చెందిన 17 ఏళ్ల నీలమధాబ్ బెహ్రా ఈ రోబోను తయారుచేశాడు. ఆ వయసులో ఉన్నవారి ఆలోచనకు కూడా అందని రోబో తయారీని ఆయన విజయవంతంగా చేసి చూపించి పలువురితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్లస్ టు సైన్స్ విద్యార్థి అయిన నీలమ్ ఈ ప్రాజెక్టు కోసం రూ.4 లక్షల వరకు ఖర్చు చేసి 4.7 అడుగుల ఎత్తు, 30 కేజీల బరువున్న ఈ రోబోను ఏడాదిలోనే విజయవంతంగా తయారుచేశాడు. బేసిక్ ప్రోగ్రామ్స్‌తో పనిచేసే ఈ  రోబోలో 14 సెన్సర్లను అమర్చినట్టు నీలమ్ వివరించాడు. త్వరలోనే మహిళల రక్షణ కోసం ఓ రోబోను తయారు చేసే ప్రాజెక్టును చేపట్టనున్నట్టు నీలమ్ వివరించాడు.

  • Loading...

More Telugu News