: శరీరం సహకరించడం లేదు.. ఆడటం ఆపేస్తున్నా: సంగక్కర
శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ సంగక్కర పూర్తి స్థాయిలో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగా... తాజాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు సైతం వీడ్కోలు చెప్పాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా సెప్టెంబర్ లో జరిగే మ్యాచ్ లలో తన చివరి మ్యాచ్ ను ఆడనున్నానని తెలిపాడు. కొన్ని నెలల్లో 40లలోకి అడుగు పెడుతున్నానని... ఇంకా ఆడాలనే కోరిక ఉన్నప్పటికీ, శరీరం సహకరించడం లేదని చెప్పాడు. ఏదో ఒక రోజు ఆటకు గుడ్ బై చెప్పాల్సిందేనని... ఇన్ని ఏళ్ల పాటు క్రికెట్ ఆడటాన్ని తాను చాలా ఆస్వాదించానని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కౌంటీల్లో సర్రే జట్టుకు సంగక్కర ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్ లో కౌంటీల్లో వెయ్యి పరుగులు సాధించాడు.