: తొలి సంపాదనను అందుకున్న నెలరోజుల తరువాత అమ్మకు ఇచ్చేశాను: ఎన్టీఆర్
సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచి, జయాపజయాలను పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతున్న యంగ్ హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ రోజు. మే 20, 1983లో జన్మించిన ఎన్టీఆర్ ఈ రోజు 35వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను చెప్పాడు. తాను హీరోగా నటించిన తొలి సినిమా 'నిన్ను చూడాలని'కి 4 లక్షల పారితోషికం తీసుకున్నానని ఆ తరువాత ఆ డబ్బుని ఎక్కడ దాచిపెట్టాలో తెలియక తికమక పడ్డానని చెప్పాడు. ఆ కవర్ను అందుకున్న తర్వాత మొదట ఇంట్లో కింద ఎక్కడో దాచిపెట్టానని, అక్కడ సేఫ్ కాదనుకొని, బాత్రూమ్‌లో పెట్టానని చెప్పాడు. అనంతరం అక్కడ కూడా సేఫ్ కాదని, కారు డాష్ బోర్డులో పెట్టానని, మళ్లీ కారు డ్రైవర్ తీస్తాడేమో అని అక్కడ నుంచి కూడా తీసేశానని చెప్పాడు. చివరికి ఏం చేయాలో తెలియక, తన తల్లికి గిఫ్ట్‌గా ఇచ్చేశానని అన్నాడు.