: సభలోకి చొరబడి విధ్వంసం సృష్టించింది కోమటిరెడ్డే: ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్


నల్గొండ సభలోకి చొరబడి విధ్వంసం సృష్టించింది ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నల్గొండ బత్తాయి మార్కెట్ లో గొడవకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, దొంగే దొంగ అన్నట్టుగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బత్తాయి మార్కెట్ తెస్తానని నల్గొండ ప్రజలకు చెబుతూ, నాలుగు దఫాలుగా ఓట్లేయించుకుని మాట తప్పిన చరిత్ర ఆయనదని, ఇంద్రవెల్లిలో రైతులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన విమర్శించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కోమటిరెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. నల్గొండ సభలో అసలు ఏం జరిగిందో తెలియని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డికి వంతపాడుతున్నారన్నారు. మంత్రుల కాన్వాయ్ పై దాడికి యత్నించారన్నారు. కోమటిరెడ్డిని సపోర్ట్ చేయడమంటే హింసను సపోర్ట్ చేయడమేనని కర్నె ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News