: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు బెదిరింపులు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కి బెదిరింపులు వస్తున్నాయని ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘బజార్’ చిత్ర యూనిట్ తెలిపింది. నగరజీవన విధానం, స్టాక్ మార్కెట్ తదితర అంశాలను ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చలేదని, సినిమా చిత్రీకరణ నిలిపేయాలని డిమాండ్ చేస్తూ సైఫ్ అలీ ఖాన్ కు చెందిన ఎక్సీడ్ టాలెంట్ ఏజెన్సీకి మెయిల్స్ వస్తున్నాయని తెలిపారు. సినిమా చిత్రీకరణ నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైఫ్ మండిపడ్డాడు. పనీపాట లేనివారే ఇలాంటి బెదిరింపులకు పాల్పడతారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరెన్ని బెదిరింపులు చేసినా సినిమా చిత్రీకరణ మాత్రం ఆగదని సైఫ్ స్పష్టం చేశాడు.