: శాస్త్రవేత్తల సరికొత్త విజయం... నీటిని విడగొట్టారు!


సుదీర్ఘ కాలంగా జరుగుతున్న ప్రయోగాలకు ఫలితం కనిపించింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణలో భాగంగా, పర్యావరణ హిత ఇంధనాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు ఫలించాయి. నీటిని ఉదజని (హైడ్రోజన్‌), ఆమ్లజని (ఆక్సిజన్‌) లుగా విడగొట్టే కొత్త ప్రక్రియను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.  

అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్రవేత్తలు నీటిని విడగొట్టడంలో విజయం సాధించామని అన్నారు. ప్రధానంగా ఉదజని ఉత్పత్తికి నీటిని వినియోగించడంలో ఎదురవుతున్న ప్రాథమిక ఆటంకాల్లో ఒకదానికి సమర్థవంతమైన పరిష్కారం దొరికిందని తెలిపారు. హైడ్రోజన్, ఆక్సిజన్ లను విడగొట్టడం ద్వారా హైడ్రోజన్ ను ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించే వీలవుతుందని, అలాగే అది పర్యావరణ హితంగా ఉంటుందని వారు వెల్లడించారు.
 
తాము చేసిన పరిశోధన భవిష్యత్ లో కర్బన ఉద్గారాలను పుట్టించకుండానే ఇళ్ల నుంచి వాహనాల దాకా ప్రతిచోట హైడ్రోజన్ వినియోగించే అవకాశం ఉంటుందని, దీనితో నీటిని ఇంధనంగా ఉపయోగించే వీలు కలుగుతుందని తెలిపారు.  

  • Loading...

More Telugu News