: నూగట్ పోయి ‘ఒ’ వచ్చె.. తాజా ఆండ్రాయిడ్ వెర్షన్‌ను విడుదల చేసిన గూగుల్


సాంకేతిక ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తాజాగా మరో ఆండ్రాయిడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం నూగట్ వెర్షన్‌ నడుస్తుండగా దాని తర్వాతి స్థానంలో రానున్న ఆండ్రాయిడ్-ఒ బీటా (పనితీరును పరీక్షించే) వెర్షన్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది నాటికి దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కాలిఫోర్నియాలో జరుగుతున్న డెవలపర్స్ సమావేశంలో ప్రకటించింది.

నూగట్‌కు మరిన్ని హంగులు అద్ది ఈ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇందులో కొత్తగా స్మార్ట్ టెక్ట్స్ సెలక్షన్, నోటిఫికేషన్ డాట్స్ వంటి వాటిని జోడించింది. కీబోర్డు నేవిగేషన్‌కు కూడా కొన్ని మార్పులు చేసింది. ఆండ్రాయిడ్-ఒ వల్ల బ్యాటరీ వినియోగం సైతం మెరుగుపడుతుందని గూగుల్ పేర్కొంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్న పరికరాల సంఖ్య 200 కోట్లకు చేరుకున్నట్టు హర్షధ్వానాల మధ్య ప్రకటించింది.

  • Loading...

More Telugu News